పోలీసు అధికారులు పిర్యాదుదారులకు న్యాయం అందించాలి అనే లక్ష్యంతో పని చేయాలి

0
26 Views

వికారాబాద్  : పోలీసు అధికారులు పిర్యాదుదారులకు న్యాయం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని జిల్లా ఎస్ పి శ్రీ ఎన్  కోటి రెడ్డి తెలిపారు.నేడు జిల్లా సాదారణ తనికీల్లో భాగంగా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు .అక్కడి రికార్డులను పరిశీలించి ,అదికారులతో మాట్లాడటం జరిగింది.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఎల్లప్పుడూ  అప్రమత్తంగా,ముందుచూపుతో పని చేసి ఎలాంటి కేసులు పెండింగ్ లేకుండా చూడాలి అని,పోలీస్ స్టేషన్ కు వచ్చే పిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉండి,పోలీసు అదికారులు పిర్యాదుదారులకు న్యాయం అందించాలి  అని ఆయన తెలిపారు.అనంతరం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఇటీవల యంకి గ్రామంలో జరిగిన మర్డర్ కేసు యొక్క సంఘటన స్థలాన్ని పరిశీలించి బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఇట్టి కేసు పట్ల ప్రత్యేకమైన టీమ్ లు ఏర్పాటు చేసి వెంటనే కేసును చేదించాలి అని డిఎస్ పి పరిగి కరుణాసాగర్ రెడ్డి గారికి జిల్లా ఎస్పి గారు ఆధేశించారు.ఈ కార్యక్రమంలో పరిగి డిఎస్పి కరుణాసాగర్ రెడ్డి ,కోడంగల్ ఇన్స్పెక్టర్ శంకర్ దౌల్తాబాద్ ఎస్ఐ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.