పోలీసు నియామకాల్లో సర్కారు మోసం …ప్రగతి భవన్ ను ముట్టడించిన బోయ అశోక్ కుమార్

0
30 Views

తాండూరు : పోలీసు ఉద్యోగాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని యువజన కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బోయ ఆశోక్ కుమార్ అన్నారు. పోలీసు నియామకాల అవకతవకలపై యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తకాపు శివసేన రెడ్డి ఇచ్చిన ప్రగతి భవన్ ముట్టడి పిలుపు మేరకు శనివారం బోయ అశోక్ కుమార్ ప్రగతి భవన్ ను ముట్టడించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్, షాట్ పుట్ పెట్టిందని, ఆర్మీ అభ్యర్థులకు పెట్టే 1600 మీటర్ల పరుగును పోలీసు నియామాకాల్లో పెట్టడం జరిగిందన్నారు. 1600 మీటర్ల పరుగు తరువాత 10 నిమిషాలు కూడ విశ్రాంతి ఇవ్వకుండా లాంగ్ జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ను పెట్టిందన్నారు. ఉద్యోగాల పేరుతో అభ్యర్థులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే పోలీసు నియామకాలను సక్రమంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.