ఆరు గ్యారెంటీల పథకాలను అర్హులందరూ సద్విని చేసుకోవాలి:వాణిజ్య పనుల శాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి

0
41 Views

వికారాబాద్(కోడంగల్):ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలను అర్హులందరూ సద్విని చేసుకోవాలని వాణిజ్య పనుల శాఖ ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి సూచించారు.మంగళవారం కొడంగల్ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ లోని ఆరవ వార్డులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తో కలిసి ఆర్థిక కార్యదర్శి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో అత్యవసరమైన వాటిని గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు 18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలు లోపు కలిగి ఉండాలని అదేవిధంగా ఎలాంటి పెన్షన్లు పొందకుండా ఉన్నవారు మాత్రమే అర్హులని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకొని దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. పథకాలకు దరఖాస్తు చేసుకునేవారికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రేషన్ కార్డు అవసరమున్నవారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. స్వంత ఇల్లు లేని వారు గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వద్ద ఏర్పాటుచేసిన ఆరోగ్య శిబిరాన్ని ఆర్థిక కార్యదర్శి ఏఏ మందులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
ముందుగా ఆర్థిక కార్యదర్శి శ్రీదేవి స్థానిక వెంకటేశ్వర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, డిఆర్డిఓ కృష్ణన్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు