చెంచుల జీవనోపాధి కొరకు మెరుగైన వసతుల కల్పన కల్పించేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలను రూపొందించాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
16 Views

వికారాబాద్:చెంచుల జీవనోపాధి కొరకు మెరుగైన వసతుల కల్పన కల్పించేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.జన్ మన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా చెంచు కుటుంబాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11 పనుల అమలు తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన చెంచులకు మెరుగైన జీవనోపాధి కల్పన కొరకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఇందులో భాగంగా ఆధార్ కార్డు లేని వారికి వెంటనే ఎన్రోల్మెంట్ చేయాలని, తహసిల్దార్ కార్యాలయాల ద్వారా వారికి కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని, అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయించి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఆయుష్మాన్ భారత్ క్రింద ప్రతి చెంచు కుటుంబానికి హెల్త్ కార్డులతో పాటు పి యం జన్ ధన్ పథకం క్రింద బ్యాంకు ఖాతాలతో పాటు పంట రుణాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ భూముల క్రమబద్దీకరణ కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని అన్నారు. నల్ల కనెక్షన్లు లేని వారిని గుర్తించి ఆవాసాల వారిగా అన్ని గృహాలకు మిషన్ భగీరథ నీటిని అందించాలని సూచించారు. చెంచు కుటుంబాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం జన్ మన్ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన అన్ని పథకాలు అమలయ్యేలా రెండు రోజులలో అధికారులు పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 15న భారత ప్రధానమంత్రి చెంచుల అభివృద్ధి కొరకు ఎంపికైన జిల్లాల అధికారులతో మాట్లాడనున్నారని అధికారం అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు.ఈ సమావేశంలో వికారాబాద్ తాండూర్ ఆర్డీవోలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, వైద్యాధికారి పాల్వాన్ కుమార్, తాసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.