ఆకాశాన్నితాకుతున్న కోడిగుడ్డు ధర…..రిటైల్ మార్కెట్ లో రూ.7

0
15 Views

వికారాబాద్:ప్రతి మనిషి ఇష్టంగా తినే పౌష్టికాహారం గుడ్డు….. గుడ్డు తింటే మనిషి ధృడంగా ఉండడంతో పాటు పోషకాలు పుష్కలంగా లభిస్తాయని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుడ్డు తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఆ గుడ్డ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొన్నటి వరకు 5 రూపాయలు గా ఉన్న గుడ్డు ఇప్పుడు ఏకంగా 7 రూపాయలకు చేరింది. దీంతో గుడ్డు కొనాలంటే జంకుతున్నారు. హోల్ సెల్ మార్కెట్ లో గుడ్డు 5 రూపాయలు పలుకుతున్నప్పటి రిటైల్ మార్కెట్ లో దాన్ని ఏడుగా విక్రయిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న గుడ్డు ధరలు చివరకు 10 రూపాయల వరకు వచ్చి ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పలువురు తెలుపుతున్నారు. గుడ్డు ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకున్నట్లయితే సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని లేక పోతే గుడ్డుకు దూరంగా కావాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.