ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ జయరామ జయజయరామ పవిత్ర మహాజప యజ్ఞం మహోత్సవం

0
20 Views

వికారాబాద్:అయోధ్య శ్రీ రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ జయరామ జయజయరామ పవిత్ర మహాజప యజ్ఞం మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. అర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో శ్రీ రామ జయ రామ అనే జపాన్ని భక్తులు 11 లక్షల సార్లు పలికే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా వికారాబాద్ పట్టణం నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని రాముని నామ స్మరణ చేయగా ఆ ప్రాంతం మొత్తం శ్రీ రామ ధ్వనితో మారుమ్రోగింది. . ఈ వేడుకలో వికారాబాద్ పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు , పట్టణ ప్రజలు , భక్తులు పాల్గొన్నారు.