వికారాబాద్‌లో అంతర్ రాష్ట్ర గొర్రెలు, మేకలు దొంగతనాలకు తెగబడిన ముఠా అరెస్ట్*

0
133 Views

వికారాబాద్: గొర్రెలు, మేకలు దొంగతనాలకు తెగబడిన అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంతయ్య తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నమ్మకమైన సమాచారంతో  వికారాబాద్ జిల్లా సీసీఎస్ (CCS) పోలీసులు శనివారం ఉదయం 2:00 నుండి 3:00 గంటల మధ్యలో చెన్ గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నారు.  ఈ సమయంలో నెంబర్ ప్లేట్లు లేని రెండు స్కార్పియో వాహనాలను పరిశీలించగా, వాటిలో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే వారిని పట్టుకొని విచారణ జరపగా, వారు ప్రభు మరియు కైలాష్ చౌహాన్ అని తెలిపారు.ఈ ఘటనలో రెండు స్కార్పియో వాహనాలు, 2 సెల్‌ఫోన్‌లు, రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వికారాబాద్, మహబూబ్ నగర్, రాయచూర్, బెంగళూరు సహా రెండు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. మొత్తం 11 మంది సభ్యులతో ఉన్న ఈ ముఠా వాహన నెంబర్ ప్లేట్లు తొలగించి దొంగతనాలు చేసేది.అరెస్టైన నిందితులు1) ప్రభు కుమార్, వయసు 32, వృత్తి డ్రైవర్, కర్నాటక యాదగిర్ జిల్లా.
2) కైలాష్ చౌహాన్, వయసు 24, వృత్తి స్కార్పియో వాహనం డ్రైవర్, కర్నాటక యాదగిర్ జిల్లా.మిగతా 9 మంది నిందితులు పరారీలో ఉన్నారన్నారు.ఈ కేసును ఛేదించిన చెన్ గోముల్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, హెచ్‌సీ చెన్నయ్య గౌడ్, గోవిందప్ప మరియు ఇతర సిబ్బందికి పోలీసు శాఖ రివార్డులు ప్రకటించింది.