జిల్లా కలెక్టర్ మహా గణపతికి పూజలు – ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

0
175 Views

వికారాబాద్, 07 : వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహా గణపతి విగ్రహానికి ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సతి సమేతంగా పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్బంగా, ఆయన జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కుటుంబ సమేతంగా వినాయక విగ్రహం వద్ద పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సూచించారు. తాము చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలని, మహాగణపతి ఆశీస్సులతో ప్రజల కష్టాలు తొలగి సుఖసంతోషాలతో జీవితం సాగాలని ఆకాంక్షించారు.

జిల్లాలోని ప్రజల ఐక్యత, సోదరభావం కలెక్టర్‌ను సంతోషపరిచింది. ఈ ఉత్సవాలు నిమజ్జనం వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, శాంతియుతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ పూజా కార్యక్రమంలో నరేందర్, అరుణ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.