యనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ 

0
184 Views

వికారాబాద్:వికారాబాద్ పట్టణంలో కుక్కల బెడదను తగ్గించడానికి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్  తీవ్రంగా చేసిన ప్రయత్నం ఫలించి.. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  చొరవతో పట్టణంలోని యనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో 42 కెనెల్స్ నిర్మించడం జరిగింది. ఆదివారం పట్టణంలోని యనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను చైర్ పర్సన్  సందర్శించారు. ఈ సందర్భంగా కుక్కలకు జరుగుతున్న సర్జరీలను పరిశీలించారు. అనంతరం చైర్ పర్సన్  మాట్లాడుతూ స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలో 1300 కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, వీటన్నిటికీ సర్జరీలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చైర్ పర్సన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  చొరవతో వెటర్నిటీ డాక్టర్లతో సర్జరీలు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే కమల నగర్ కాలనీ నుండి తీసుకెళ్లిన 13 కుక్కలకు సర్జరీలు చేయడం జరిగింది. కావున త్వరలోనే వికారాబాద్ పట్టణంలో కుక్కల బెడద అనేది లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు