ప్రతి కార్యకర్తను గౌరవించే పార్టీ బీజేపీ : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

0
83 Views

వికారాబాద్: ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీ నే స్పష్టం చేశారు. తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో బీజేపీ కీ సైతం అన్నే సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా గురించి గతంలో ఉన్న నాయకులు అనేక మాటలు మాట్లాడిండ్రు అభివృద్ధి మాత్రం చేయలేదని చంద్రశేఖర్ రావుతో పాటు అన్న ఒక పార్టీతో తమ్ముడు ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు ప్రాంతానికి అన్యాయం చేశారని మండి పడ్డారు. రఘునందన్ హైడ్రా గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి కి సపోర్ట్ చేస్తుండని బీఆర్ఎస్ సన్నాయి నొక్కులు నొక్కుతూండ్రని నేను ఎవరికీ వత్తాసు పలకను…. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడతానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తెలుగు భాష గురించి అమెరికా లో మాట్లాడుతుంటాడని ఈయనకు ఎలాగో మాట్లాడడంరాదని …ఎవడు రాసిచ్చిండో నని చూస్తే శ్యామ్ పిట్లోడా అనేటోడు రాసించిండని తెలిసిందన్నారు. దేశాన్ని పాలించిన తాతకు తెలియదని ఇప్పుడున్న మానవుడికి ఈ దేశం గురించి తెలియదని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోడీ గురించి దేశ విచ్చినాన్ని కోరుకునే వారు రాసిస్తే రాహుల్ గాంధీ మాట్లాడుతుండని అన్నారు. రాహుల్ గాంధీ కీ పెళ్లయిందని ఓ పత్రిక రాస్తే దాన్ని సైతం తల్లి సోనియా గాంధీ కండించలేదని రాహుల్ పై తప్పుడు వార్తలతో నాతోటి ఎంపీ గురించి తప్పుడు ప్రచారం చేస్తుండని బీజేపీ నాయకుడు కేసు వేసిన పరిస్థితి వచ్చిందన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ గెలిస్తే నే ఈ దేశం క్షేమంగా ఉంటుండి… అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి ఒక్కరు వెయ్యి మంది టార్గెట్ గా పెట్టుకుని సభ్యత్వం చేయించాలని సూచించారు. అనంతరం అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామిని బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి, రాష్ట్ర నాయకులు సదానందారెడ్డి, శివరాజ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్లనందు, బీజేపీ నాయకులు  రాజేందర్ రెడ్డి, బుస్సా శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి, పోకల సతీష్, శిరీష, వివేకానందారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.