ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం: మాజీ ఎమ్మెల్యే ఆనంద్

0
162 Views

వికారాబాద్: కాంగ్రెస్ గుండాలు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతే  ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ఎమ్మెల్యే గాంధీని అతడి అనుచరులను కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వదిలి కౌశిక్ రెడ్డిని మాత్రం హౌస్ అరెస్ట్ చెయ్యటం ఏంటి అని ప్రశ్నించారు.హౌస్ అరెస్ట్ లో ఉన్న కౌశిక్ రెడ్డి మీదకి కాంగ్రెస్ గుండాలు వెళ్ళటం గేట్లు, గోడ దూకి మరి దాడికి పాల్పడటం ఏంటన్నారు,ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేసారు.