విద్యార్థులు తమలోని ఆత్మన్యూ నతా భావాన్ని వీడి ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగాలి:వికాస్ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాస్

0
105 Views

వికారాబాద్: విద్యార్థులు తమలోని ఆత్మన్యూ నతా భావాన్ని వీడి ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగినప్పుడు విజయం సునాయసమౌతుందని వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ ఫోరం అధ్యక్షులు,వికాస్ జూనియర్ కళాశాల వ్యవస్థాపకు లు కె.శ్రీనివాస్ అన్నారు.స్థానిక క్లబ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నాడు వికాస్ జూనియర్ కళాశాల జూనియర్ విద్యార్థులకు, సీనియ ర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం ( FRESHE R’S PARTY)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు కాలం వృధా చేసుకో కుండా ప్రణాళికా బద్దంగా చదివి లక్ష్యం సాదించాలన్నారు. తల్లిదండ్రుల, గురువుల కలలను సాకారం చేయాలన్నారు.ప్రస్తుత పోటీఇ ప్రపంచంలో విజయం సాదించాలంటే మామూలు చదువులు సరిపోవని, ప్రమాణాలతో కూడిన విద్య అవసమన్నారు.వికారాబాద్ ప్రాంతంలో 24 సంవత్సరాలుగా ప్రమాణాలతో కూడిన విద్యను అందజేస్థూ,పేద ప్రజలకు అతి తక్కువ ఫీజులకే విద్యను అందజే స్థున్నామన్నారు.విధ్యార్థి భవిష్యత్తును నిర్ణయించే ఇంటర్మీడియట్ లో కష్టపడి, ఇష్టపడి చదివిన వారికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో గత సంవత్సర మొదటి,రెండవ సంవత్సర టాపర్ల ను ఘనంగా సన్మా నించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతి క కార్యక్రమాలు అందరి ని అలరిం పజేసాయి. కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ ఉమారాణి, అధ్యాపకులు ప్రభాకర్ రెడ్డి, రామచంద్రయ్య, కృష్ణ,సురేశ్, శ్రీనివాస్ రెడ్డి,రమేశ్,వరలక్ష్మి, శ్రీనివాస్,విద్యార్థులు పాల్గొన్నారు