వికారాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు అరెస్టు

0
144 Views

వికారాబాద్:నిన్న బిఆర్ఎస్ ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడికి దిగిన అరికే పూడి గాంధీ ఇంటిని ముట్టడించాలని బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు  పిలుపు ఇవ్వడంతో వికారాబాద్ పట్టణ పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ ఎస్ నాయకులు పేర్కోన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో గెలిచి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీ ఈరోజు మాట మార్చి టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని కాంగ్రెస్లో చేరలేదని ప్రజలను తప్పుదోవ పట్టియడాన్ని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి దాడులకు తెగబడ్డ అరికెపూడి గాంధీ నీ చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఇలాంటి దాడులను నియంత్రించకపోతే బి ఆర్ఎస్ పార్టీ ప్రతిదారులకు సిద్ధపడుతుందని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని చూసి చీదరించుకుంటున్నారని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో సీనియర్ నాయకులు మంచన్పల్లి సురేష్,సుభాన్ రెడ్డి, కృష్ణారెడ్డి, భరత్,కిషోర్,ప్రవీణ్, గాండ్ల మల్లికార్జున్,గోపి, లక్ష్మణ్, మల్లేష్, కాశయ్య, దశరథ్, తదితరులు ఉన్నారు.