లిఫ్ట్ లో ఇరుక్కున్న డిఎస్పీ

0
25 Views

హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని హైదర్ గూడ వద్ద ఇంటెలిజెన్స్ డిఎస్పి తో పాటు మరో వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎస్వీఎం గ్రాండ్ హోటల్ లిఫ్ట్ లో  ఇంటెలిజెన్స్ డిఎస్పీ సత్యనారాయణ రాజు ఇరుక్కుపోయారు. డీఎస్పీని బయటకు తీసేందుకు వెళ్లి ఎలక్ట్రీషియన్ లిఫ్టులో ఇరుక్కుపోయాడు. ఎంతకు లిఫ్ట్ తెరుచుకోకపోవటంతో ఎలక్ట్రీషియన్ ఆందోళనకు గురైయ్యాడు.  హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్టులో ఇరుక్కున్న ఇంటెలిజెన్స్ డిఎస్పి సత్యనారాయణ రాజు తో పాటు ఎలక్ట్రిషన్ ను బయటకు తీసి ఆసుపత్రికి పోలీసులు తరలించాారు.