ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 44 మంది విద్యార్థినీలకు అస్వస్థత

0
22 Views

వికారాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 44 మంది విద్యార్థినీలకు అస్వస్థత గురయ్యారు.
జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం వండిన ఆహారం తిని 44 మంది విద్యార్థినీలు అస్వస్థకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న విద్యార్థినీలను హాస్టల్ సిబ్బంది జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం వండిన కిచిడి, సరిగా ఉడకని అన్నం తినడం వల్లనే వాంతులు, విరోచనాలు, కడుపుల నొప్పి వచ్చినట్లు విద్యార్థినీలు తెలిపారు. హాస్టల్ వంట మరియు శానిటేషన్ సిబ్బంది గత 46 రోజులుగా ధర్నా చేపడుతున్న నేపద్యంలో హాస్టల్ బోధన సిబ్బందే వంటలు వండి విద్యార్థినీలకు పెడుతున్నారు. వంటలు సరిగా వండడం రాకపోవడంతో ఆహారం కలుషితం అయినట్లు విద్యార్థినీలు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ లూథర్ విల్సన్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినీలను విషయం అడిగి తెలుసుకొని విచారణ చేపడుతున్నారు.