స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలి:కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
20 Views

వికారాబాద్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎన్నికల నిర్వహణ అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.ఎన్నికల షెడ్యుల్ కు పెండింగ్లో ఉన్న ఫామ్స్ అన్నియు పూర్తి చేయాలనీ అన్నారు. పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని నోడల్ అధికారులకు సూచించారు.వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ , ఆర్ డి ఓ విజయకుమారి, శ్రీనివాసులు ,ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రినివాస్ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.