ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పై దాడి చేసిన లేడీ కానిస్టేబుల్ పైన చర్య తీసుకోవాలని గవర్నర్ కి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు

0
50 Views

అనంతగిరి డెస్క్:ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పై దాడి చేసిన లేడీ కానిస్టేబుల్ పైన చర్య తీసుకోవాలని   ఏబీవీపీ నాయకులు శనివారం  ABVP రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గవర్నర్ తమిలిసాయి సౌందరరాజన్ ని కలిసి వినతి పత్రం అందజేశారు .జీవో 55ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతి యుతంగా నిరసన చేస్తున్న ABVP స్టేట్ సెక్రెటరీ పై (24-01-2004) నాడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఉద్దేశ్యాన్ని గవర్నర్  దృష్టికి తీసుకు వెళ్లడం వెళ్లారు.తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం:55 ద్వార జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ 100 ఎకరాల భూములను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించిన తీరును ఖండిస్తు ABVP అధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తోందని, దీనిపైన స్పందించిన విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ విశ్వవిద్యాలయ భూములను కాపాడుకోవడానికి ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగిందని ఏబీవీపీ బృందం గవర్నర్ కి తెలియజేయడం జరిగింది. చింతకాయల ఝాన్సీ ఇతర ABVP విద్యార్థి నాయకులతో కలిసి శాంతియుతంగా చేస్తున్నా నిరసనకారులపై పోలీసు అధికారులు అమానవీయంగా దాడి చేయడం విచారకరం అని , శాంతియుతంగా ముందుకు వెళ్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పైన ఆశ్చర్యకరంగా లేడీ కానిస్టేబుల్స్ స్కూటీతో వెంబడించి వెంట్రుకలతో పట్టుకోవడం , రన్నింగ్ వాహనంతో పాటు ఆమెను లాగడం, వల్ల తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చేరడం జరిగిందని, దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. యూనివర్సిటీ భూములు రక్షించాలని న్యాయ పోరాటం చేస్తున్న ABVP నాయకుల పైన ఈ విధంగా దాడి చేయడం విద్యార్థుల యొక్క హక్కులను కాలరాయడమే అని ఖండించారు.జాతీయ బాలికా దినోత్సవం రోజున జరిగిన ఈ దాడిని ఖండించాలని డిమాండ్ చేస్తున్నాము అని ఘటనకు సంభందించి  వారిపై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరారు. అదేవిధంగా ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 ను రద్దుచేసి యూనివర్సిటీ భూములను కాపాడేల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ, స్టేట్ జాయింట్ సెక్రెటరీలు శ్రీనాథ్, పృధ్విరాజ్, కళ్యాణి పాల్గొన్నారు.