వేణు నాధంతో మైమరపించిన పూడూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

0
17 Views

వికారాబాద్: వేణు నాధంతో వూడూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి సభికులను అబ్బుర పరిచారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వలు పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు చేయగా, వూడూరు మండలం ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 9వ తరతగతి చదువుతున్న వజ్ర నిర్దోష, 7వ తరగతి చదువుతున్న విద్యార్థి పి. మురారి లు మురళి గానంతో సభికులను మైమరపించారు. విద్యార్థి వజ్ర నిర్దోష గణపతి పాఠతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, విద్యార్థి మురారి జాతీయ గీతాన్ని వేణు నాదంతో ఆలపించి ముగించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఆయా రంగాల్లో విద్యార్థులు రాణించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థి మురారి, వజ్ర నిర్దోష లకు పిల్లన గ్రోవిలో తర్పీదునిచ్చిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ను అభినందించారు.. అనంతరం విద్యార్థుల ప్రతిభను ప్రశంసించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, డీఆర్డీఓ కృష్ణన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, వశుసంవర్ధక శాఖ అధికారి సునిల్, మైన్స్ ఏడీ జాకబ్, డీపీఆర్ఒ ఎం.డి. ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.