జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ (LB) రాహుల్ శర్మ

0
12 Views

వికారాబాద్: జిల్లా గ్రంథాలయ సంస్థ  ఇన్చార్జిగా అదనపు కలెక్టర్ (LB) రాహుల్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం 32 మంది గ్రంధాల సంస్థ చైర్మన్ లను తొలగించిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ (LB) గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇంచార్జిగా గురువారం బాధ్యతలను సేకరించారు. అనంతరం గ్రంథాలయ సంస్థ సెక్రటరీ సురేష్ తో గ్రంథాలయానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రంథాలయానికి సంబంధించి పాఠకులకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల సంస్థ సెక్రటరీ సురేష్ బాబు, డిప్యూటీ లైబ్రరీయన్ కిషన్ పాల్గొన్నారు.