పట్టణంలోని మసీదుల దగ్గర అన్ని సౌకర్యాలు కల్పించాలి : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల

0
14 Views

వికారాబాద్: రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమైన సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని మసీదుల దగ్గర పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, మంచినీటి సదుపాయం కల్పించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల కు ముస్లిం మైనారిటీ నాయకులు మెమోరండం అందించారు. అందుకు వెంటనే స్పందించిన చైర్ పర్సన్ మంజుల రమేష్ … మున్సిపల్ అధికారులతో మాట్లాడి మసీదుల దగ్గర పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఎక్కడైతే వీధి దీపాలు లేవో అక్కడ వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేసి, మంచినీటి సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించారు. అడిగిన వెంటనే స్పందించడంతో చైర్ పర్సన్ గారికి మైనారిటీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.చైర్ పర్సన్ ని కలిసిన వారిలో కో ఆప్షన్ సభ్యులు, ఎర్రవల్లి జాఫర్, వికారాబాద్ నియోజకవర్గం మైనారిటీ చైర్మన్ సర్ఫరాజ్, వికారాబాద్ పట్టణ మైనారిటీ ప్రెసిడెంట్ హాజీ పాషా, వికారాబాద్ పట్టణ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ ఫరూక్, వికారాబాద్ టౌన్ జనరల్ సెక్రెటరీ ముస్తాక్, కొత్తగాడి ఉస్మాన్, జహంగీర్, మహమ్మద్, లాల్ మహమ్మద్, జిలాని, ఖలేద్, మౌలానా, కుట్బుద్దిన్ తదితరులు ఉన్నారు.