ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ లకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తుల ఆహ్వనం:కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లికార్జున్

0
116 Views

వికారాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ లకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు జిరాక్స్ నఖల్ కాపీలతో హాజరు కావలసిందిగా ఆయన తెలిపారు. వివిధ విభాగాల్లో (57) సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు సంబంధించి https://gmcvikarabad.org/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. పైన తెలిపిన ఉద్యోగాలకు గౌరవ వేతనం కింద చెల్లించబడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.