ఎసిఆర్ భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ పరిగి లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

0
114 Views

పరిగి: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎసిఆర్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ లో త్రివర్ణ పథకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పర్గి సివిల్ జడ్జి శ్రీమతి నాగుల శిల్ప  హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని అన్నారు. స్వతంత్రం అనేది స్ఫూర్తి అని అన్నారు. స్వతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తి మనకు నిత్య జీవన గమనానికి ఒక పాఠం అని. మాతృ దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి భృంగీ విద్యాసంస్థల చైర్మన్ ఏ  చంద్రశేఖర్  మాట్లాడుతూ.   విద్యార్థులు యువత ఉన్నత చదువులు చదవాలని, చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, సమాజానికి దేశానికి ఉపయోగపడే పనులు చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులుర్థలు దేశ భక్తి గీతాలకు సాంస్కృతిక నృత్యాలు చేశారు ఆనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎసిఆర్ భృంగి విద్యాసంస్థల కార్యదర్శి శ్రీమతి .ఎ ప్రమీల, ప్రిన్సిపల్ వెంకటరమణ , డైరెక్టర్ కుమారస్వామి , ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.