కోడంగల్ పట్టణ సుందరీకరణకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేపట్టాల్సి న పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
16 Views

వికారాబాద్:కొడంగల్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి అధికారులు చర్యలు చేపడుతున్నరు. ఇందులో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కన్ఫరెన్స్ హాల్ లో కొడంగల్ పట్టణ సుందరీకరణపై జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి NCPE ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇండియా (P) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ Dr. SM సుభాని తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు.కొడంగల్ మున్సిపల్ పరిధిలో పార్కులు, పక్కా సిసి రోడ్లు, డ్రైనేజీలు, అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి, చెరువు కట్ట అభివృద్ధితో పాటు చెరువు వద్దబతుకమ్మ ఘాట్, నిమజ్జనం, డంపింగ్ యార్డ్, క్రిమిటోరియం, క్రీడా ప్రాంగణం, సెంట్రల్ లైటింగ్, జాతీయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. అవసరమైన నిధులు తదితర అంశాలను సంబంధిత అధికారులతో అధికారులతో సంప్రదించనున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, కొడంగల్ వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు ప్రవీణ్ కుమార్, జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.