18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
236 Views

వికారాబాద్:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరును నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ సర్వే చేయాలని బూతు లెవల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశము హాలు నుండి డిఎల్ ఏం టి లు , ఏ ఎల్ ఏం టి లకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కార్యక్రమం లో మాట్లాడుతూ జనవరి 1, 2025 ప్రామాణికంగా ఓటర్ జాబితా సవరణ 2025 కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రీ రివిజన్ నిర్వహించి అక్టోబర్ 29న ముసాయదా ఓటరు జాబితా విడుదల చేయాలని, నవంబర్ 28, 2024 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వికరించాలని అన్నారు.ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18, 2024 వరకు బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వారిగా ఇంటింటికి తిరుగుతూ ఓటరు ధృవీకరణ చేపట్టాలని, ఓటరు జాబితాలో అవసరమైన చోట పాత ఫోటోలను తొలగించి ఓటర్ల నూతన ఫోటోలు అప్లోడ్ చేయాలని, జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు 100 శాతం వెరిఫికేషన్ మరియు పోలింగ్ స్టేషన్ మార్పు అవసరం ఉంటే చేయాలని అన్నారు.అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 28 వరకు జనవరి ఒకటి 2025 ప్రామాణికంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ముసాయిదా జాబితాన్ని రూపొందించాలని అన్నారు.మరణించిన ఓటర్ల వివరాలను, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఓటర్ జాబితా నుంచి ఫారం 7 ద్వారా తొలగించాలని అన్నారు. అలాగే ఫారం 6, 6ఏ, 6 బి గురించి వివరించారు.ఓటర్ జాబితాలో ఉన్న మల్టీ ఎంట్రీలను తొలగించాలని, అదేవిధంగా ఓటర్ కార్డు పై ఉన్న పొరపాట్లు పరిష్కరించాలని సూచించారు.
సమావేశంలో ఆర్ డి ఓ వాసుచంద్ర, జిల్లా స్తా యి, అసెంబ్లీ స్తా యి, మాస్టర్ ట్రైనర్స్ , ఎనికల విబాగము సుపరింతెన్దేంట్ నేమత్ అలీ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.