విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

0
100 Views

అనంతగిరిడెస్క్ (హైదరాబాద్): రాష్ట్రంలో ఎస్సీ శాఖ మంత్రి, ఎస్టీ శాఖ మంత్రి, మైనారిటీ శాఖ మంత్రి, విద్యా శాఖ మంత్రి లేరని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. ఇది విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర అసమర్థతను సూచిస్తుంది. విద్యార్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
విద్యార్థుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై ప్రతీకార పాలన నడుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పలువురు నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో సుమారు 12.30 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్‌ చెల్లించకపోవడంతో, అనేకమంది విద్యార్థులు కాలేజీల్లో తమ సర్టిఫికెట్లను పొందలేక అష్టకష్టాలు పడుతున్నారు.”ప్రజా పాలన అంటూ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారు. కానీ, వాస్తవంగా ఈ పాలన ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రతీకార ధోరణితో సాగుతుందని, విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారని” డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.