వికారాబాద్ కు నీటి కష్టాలు…. డిమాండ్ల పరిష్కరించాలని సమ్మెకు దిగిన మిషన్ భగీరథ కార్మికులు

0
16 Views

వికారాబాద్: జీవో 11 ప్రకారం తమ డిమాండ్లను పరిష్కరించాలని మిషన్ భగీరథ కార్మికులు గురువారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాకు పంప్ హౌస్ నుంచి సరఫరా అయ్యే నీరు నిలిచిపోయింది. వికారాబాద్ సింగ్ మెంట్  పరిధిలో ఒక రోజుకు 43 ఎం ఎల్ డి నీరు అవసరం పడుతుంది.  పాతూరు , ఎక్ మామిడి , కేసారం, మోమిన్ పేట ,మర్పల్లి 1, మర్పల్లి 2,కొంపల్లి ,ఎన్కెపల్లి ,తొర్మామిడి, బంట్వారం ,బూర్గుపల్లి, కేరెళ్లి వికారాబాద్ కు నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం కార్మికులు సమ్మెకు వెళ్లడంతో ఈ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. వికారాబాద్ మున్సిపాలిటీలో ప్రత్యామ్నాయంగా శివ సాగర్ నీటిని అందించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఫిల్టర్ బెడ్ శుద్ధి పరికరాలు సరిగ్గా లేక ఆ నీటిని శుద్ధి చేయలేకపోతున్నారు. మొన్నటివరకు పైప్ లైన్ సమస్యలు ఉన్నప్పటికీ గత మూడు రోజులుగా పైప్ లైన్ సమస్య పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు అట్టి పనులు ఈరోజు లేదా రేపు పూర్తయినప్పటికీ శివసాగర్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసే పరికరాలు బాగా లేక అట్టి నీటిని ఎలా సరఫరా చేయాలని ఆలోచనలు మున్సిపల్ యంత్రాంగం ఉంది. ఫిల్టర్ బెడ్ లోని పరికరాలను మరమ్మతు చేస్తే ఎందుకు 12 లక్షల వరకు వ్యయం అవుతుందని మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర పేర్కొన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో కేవలం నాలుగు వాటర్ ట్యాంకులు మాత్రమే నీటి సరఫరాకు ఉండగా వికారాబాద్ పట్టణంలో 34 వార్డులకు ఈ ట్యాంకులు ఏ మేరకు సరిపోతాయో చూడాలి. ఇదిలా ఉంటే గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు లేక ప్రజలు అవస్థలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.