ప్రజా పాలన సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా కంప్యూటరీకరణ చేపట్టండి :ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి

0
15 Views

వికారాబాద్:ప్రజా పాలన సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా కంప్యూటరీకరణ చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.సోమవారం హైదరాబాద్ డా.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో ప్రజా పాలన ధరకాస్తుల  కంప్యూటరీకరణ, కష్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) వానాకాలం , యాసంగిపై , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ లు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలం, యాసంగి 2022-23 సంబందించి మిల్లర్లు వారికి కేటాయించిన రోజు వారి లక్ష్యాలను మిల్లింగ్ కెపాసిటీ ప్రకారం రోజువారి లక్ష్యాలను పూర్తి చేయుటకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ  ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన (6) గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కంప్యూటరికరీణ వేగవంతంగా స్పష్టంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ మంత్రి  సూచనల మేరకు జిల్లాలో ఎలాంటి జాప్యం లేకుండా సీఎంఆర్ డెలివరీ టార్గెట్ పూర్తి చేయుటకు వెంటవెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాలు పూర్తి చేసే వరకు సంబంధిత మిల్లులును తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  లింగ్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు.