టీబీ ఆసుపత్రి సిబ్బందిని స్థానికంగానే పనిచేయాలి: స్పీకర్ నుకోరిన టీబీ ఆసుపత్రి నాలుగవ తరగతి ఉద్యోగులు

0
42 Views

వికారాబాద్: టీబీ ఆసుపత్రిలో ఎన్నో ఏళ్లుగా పని చేసిన మమ్మల్ని స్థానిక ఆసుపత్రుల్లోనే ఉంచాలని దూరం పంపించవద్దని టీబీఆసుపత్రి సిబ్బంది కోరారు. శుక్రవారం అనంతగిరిలోని టీబీ ఆసుపత్రి వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. టీబీఆసుపత్రికి ఎంతో మంది వచ్చేవారని ఇప్పటికి కూడా టీబీ బాధితులు అనంతగిరికి వస్తున్నారని ఇక్కడ టీబీ ఆసుపత్రికి కోసం నాలుగు వార్డులు ఏర్పాటు చేస్తే మేము స్థానికంగా ఇక్కడ పని చేసుకుంటామని కోరారు. మమ్మల్ని ఎక్కడికో పంపించాలని చూస్తున్నారని మండి పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర స్థాయిలో టీబీ విషయమై చర్చించడం జరిగిందని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు