ఆ రైతు వేదిక అద్భుతం

0
20 Views

వికారాబాద్ (కేరెల్లి) : రైతులను ఒక వద్దకు చేర్చి సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ఏర్పాటుచేసిన రైతు వేదికలు రాష్ట్రవ్యాప్తంగా నిరుపయోగంగా దర్శనమిస్తుంటే వికారాబాద్ జిల్లా ధరూరు మండలం కెరెల్లి గ్రామంలో గ్రామస్తుల అందరికీ ఉపయోగపడుతూ రైతు వేదిక ఆదర్శంగా  నిలుస్తుంది. కేరెళ్లి రైతు వేదిక ను గ్రామ సర్పంచ్ రిటైర్డ్ వ్యవసాయ శాఖ అధికారి కొత్తపల్లి నరసింహారెడ్డి అందంగా ముస్తాబు చేస్తున్నాడు. అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడే విధంగా రైతులను ఆకర్షించే విధంగా రైతులు నిత్యం వచ్చి రైతు వేదికలో కూర్చొని ముచ్చటించే విధంగా రైతు వేదిక ముందు డస్ట్ వేయించి బల్లలు ఏర్పాటు చేశారు. ముందు భాగంలో మొక్కలు పెంచి అందంగా ముస్తాబు చేశారు. గ్రామస్తులు వాకింగ్ చేసుకోవడంతో పాటు వ్యాయామం చేసుకోవడానికి అనువైన స్థలంగా రైతు వేదిక ను తీర్చిదిద్దారు. రైతులతో పాటు గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా రైతు వేదికలు ఉన్నాయని రాష్ట్రంలోని రైతు వేదిక అన్ని కూడా ఇలా ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు