బ్రేకింగ్ న్యూస్ కొండా సురేఖ రాజీనామా

0
23 Views

అనంతగిరి డెస్క్ : రా జకీయ వ్యవహారాల కమిటీలో పార్టీ తన పేరును చేర్చకపోవడం పట్ల అసంతృప్తితో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాజీ మంత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన కొండాసురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు.  వరంగల్ జిల్లా నుంచి ఒకరికి కూడా అవకాశం కల్పించలేదని ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాన్ని అవమానపరిచే విధంగా ఉందని ఆమె లేఖల అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని ఒక వ్యక్తి కోసం మంత్రి పదవిని వదులుకున్న నేను రాజకీయ పార్టీ కోసం ఏమైనా చేస్తానని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటి నుండి ఒక సామాన్య కార్యకర్త లాగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆమె లేఖలో స్పష్టం చేశారు.