వికారాబాద్ జిల్లాలో ఎస్ఐల బదిలీలు

0
30 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో 9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మోమిన్ పేట ఎస్ఐగా ఉన్న విఠల్ రెడ్డిని, కరణ్ కోట్ కు బదిలీ చేయగా, తాండూరు ఎస్ఐ అరవింద్ ను మోమిన్ పేటకు, చన్ గోముల్ ఎస్ఐ గిరేనా ను పెద్దెముల్ కు, కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని చన్ గోముల్ కు, వికారాబాద్ వీఆర్ లో ఉన్న రమేష్ ను బషీరాబాద్ కు, బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ను ధారూరు పీఎస్ కు , ధారూరు ఎస్ఐ సంతోష్ కుమార్ ను పరిగికి, పరిగి ఎస్ఐ సత్యనారాయణ ను వికారాబాద్ వీఆర్ కు , పెద్దేముల్ ఎస్ఐ కాశీనాథ్ ను వికారాబాద్ వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.