బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వడ్లనందు

0
46 Views

వికారాబాద్: వికారాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్  వైఖరి నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్లనందు  పేర్కొన్నారు. రాజీనామా లేఖను అధిష్టానంకు పంపించడం జరిగిందన్నారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదని, అదే విధంగా ఆయన వల్లే పార్టీ అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. అంతే కాకుండా పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.