వరంగల్ లో బేరి నరేష్ అరెస్ట్

0
28 Views

వికారాబాద్ : కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టి ఓ సభలో బేరి నరేష్ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యాలు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి గురించి తప్పుగా మాట్లాడడంతో ఆయన పై కొడంగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బేరి నరేష్ పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వరంగల్ లో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. బేరి నరేష్ ను కొడంగల్ కు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన మాటలకు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాల నాయకులు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా హిందూ దేవుళ్లను అవమానించిన బేరి నరేష్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ ద్వారా డిమాండ్ చేయగా వికారాబాద్ ఎస్పీ ఆయనపై కేసు నమోదు చేయడం జరిగిందని అదుపులోకి తీసుకుంటామని బదులిచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు.