
General
కామారెడ్డి గూడ గ్రామంలో శుభ్రత కార్యక్రమం
Wednesday, 11 March 20268 views
Advertisement
వికారాబాద్: గ్రామంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ శంకరమ్మ, ఉపసర్పంచ్ శివరాజ్ గౌడ్ కోరారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి గూడ గ్రామంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రోడ్లను శుభ్రపరచడంతో పాటు మురికి కాలువలను క్లీనింగ్ చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. అదేవిధంగా గ్రామంలో పారిశుధ్యం కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
Share this article


