
13 మంది ఆర్మీలో ఎంపిక.. జేఎస్ఆర్ అకాడమీలో సన్మాన కార్యక్రమం
Advertisement
వికారాబాద్ : ఎస్‌ఏపీ కళాశాల మైదానంలో జేఎస్ఆర్ అకాడమీలో శిక్షణ పొందిన 13 మంది యువకులు భారత ఆర్మీలో ఉద్యోగాలు సాధించడం పట్ల జేఎస్ఆర్ అకాడమీలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ అంజయ్య, ఆర్మీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. అలాగే యువతకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించి విజయపథంలో నడిపించిన జేఎస్ఆర్ అకాడమీ డైరెక్టర్, కోచ్ శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా సన్మానించి ప్రశంసించారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని దేశ సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘుకుమార్ పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన 13 మంది యువకులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. అకాడమీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Share this article


