
అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ ప్రారంభోత్సవానికి రైతుల తరలింపు
Advertisement
వికారాబాద్, జూన్ 6: రంగారెడ్డి జిల్లా పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వికారాబాద్ నుంచి రైతులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు మరియు రైతులు పెద్ద సంఖ్యలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. కార్యక్రమానికి వెళ్లే వాహనాలను ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ జెండా ఊపి ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు, నిల్వ సదుపాయాలు, ఎగుమతి అవకాశాలు పెరుగుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Share this article


