download
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
General

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

Saturday, 7 March 20260 views

Advertisement

వికారాబాద్, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు గౌరవం, సమాన అవకాశాలు లభించే సమాజంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నేటి తరం మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు, రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. దేశ నిర్మాణంలో మరింత మంది మహిళలు ఆత్మవిశ్వాసం, పట్టుదల, సంకల్పంతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. మహిళల భద్రత విషయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అవసరమైనప్పుడు మహిళలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో షీ టీమ్, కళాజాత బృందం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు తమ హక్కులు, చట్టాలు, భద్రతకు సంబంధించిన సేవలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి మహిళా తన హక్కులపై అవగాహన పెంపొందించుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ తన లక్ష్యాలను సాధించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పిలుపునిచ్చారు.

Share this article

Related Articles