
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు
Advertisement
వికారాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోట్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీరోలు గ్రామ స్వతంత్ర సర్పంచ్ మోముల సుధాకర్, వార్డు సభ్యులు, అనుచరులు మరియు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ సంగారెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this article


