download
 ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష పేపర్ విడుదల
General

ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష పేపర్ విడుదల

Sunday, 22 March 2026191 views

Advertisement

వికారాబాద్, మార్చి 22: అనాథ, నిరుపేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడంలో ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ (PPT) కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో ఉన్న యూనిక్ హై స్కూల్‌లో టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ప్రవేశ పరీక్ష పేపర్ విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐఐటీ చుక్క రామయ్య ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అనాథలు, నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. నేటి సమాజంలో స్వార్థపూరిత ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో, సమాజ సేవ కోసం కృషి చేస్తున్న ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విలువలు కలిగిన, సమాజ పట్ల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్. వెంకట్ రత్నం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జిల్లాలోని అనాథ మరియు నిరుపేద విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 50 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా విద్యను అభ్యసిస్తున్నారని, ఎంపికైన విద్యార్థుల విద్య పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులను ట్రస్ట్ భరిస్తుందని వెల్లడించారు. ఈ సంవత్సరం నిర్వహించిన పరీక్షకు 36 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్. బాబు రావు, కోటిపల్లి మండల అధ్యక్షుడు పి. రామచంద్రయ్య, జిల్లా కమిటీ సభ్యులు జి. రాములు, యూనిక్ హై స్కూల్ కరెస్పాండెంట్ తిరుమల, ట్రస్ట్ ప్రతినిధులు బుచ్చిబాబు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Share this article

Related Articles