
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన – తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
Advertisement
వికారాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజులలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ సూచించింది.
Share this article


