download
జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో  టింకరింగ్ ఎక్స్‌పో
General

జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో టింకరింగ్ ఎక్స్‌పో

Saturday, 7 March 20263 views

Advertisement

వికారాబాద్: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వికారాబాద్‌లో శుక్రవారం కోడింగ్ యంత్ర ఆధ్వర్యంలో టింకరింగ్ ఎక్స్‌పో–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు చిన్ననాటి నుంచే అన్వేషణ, ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ వంటి లక్షణాలను అలవర్చుకుని మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు రోబోటిక్స్ విద్య ఎంతో అవసరమని తెలిపారు. వంటిల్లు నుంచి యుద్ధరంగం వరకు ప్రతి రంగంలో రోబోటిక్స్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుమాంజలి, స్వప్న, ఝాన్సీ, కమల, భారతమ్మతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share this article

Related Articles