
General
ఎస్‌కే ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం
Tuesday, 24 February 20262 views
Advertisement
మర్పల్లి: మర్పల్లి మండలంలోని పంచలింగాల్ గ్రామానికి చెందిన పెద్ద గొల్ల పాండు అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ట్రస్ట్ తరఫున రూ.5,000 ఆర్థిక సాయం పంపించారు. ఈ నగదును సనగారి సురేందర్ రెడ్డి మరియు సురేశ్ కుమార్ యాదవ్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ అభ్యర్థి సురేశ్, హరి కిషన్ రెడ్డి, మల్లా రెడ్డి, సంజీవ్ యాదవ్, వార్డు సభ్యుడు సామెల్, శేఖర్, మాణిక్యం, రవి, భాగయ్య, అనంతయ్య, భాస్కర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this article


