
సంక్షేమ పథకాల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Advertisement
హైదరాబాద్, మార్చి 3: సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సభల్లో పథకాల వారీగా ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు కచ్చితంగా జరిగేలా పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. అలాగే 99 డేస్ ప్రోగ్రామ్‌లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
Share this article


