download
2025 తెలంగాణ ‘గద్దర్’ సినీ అవార్డుల ప్రకటన
General

2025 తెలంగాణ ‘గద్దర్’ సినీ అవార్డుల ప్రకటన

Saturday, 7 March 20260 views

Advertisement

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే 2025 ‘గద్దర్’ సినీ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు చిత్రాలకు ఈ అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్‌) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌) నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఎంపికైంది. అవార్డు గ్రహీతలు ఇలా ఉన్నారు: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్‌ షో నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌ ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ – లిటిల్‌ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్‌ ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా వ్యక్తిగత విభాగాలు: ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు – శివాజీ ఉత్తమ సపోర్టింగ్‌ నటి – భూమిక ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె. రాబిన్‌ (దండోరా) ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్‌) ఉత్తమ బాలనటుడు – రోహన్‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో) ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా) ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) ఉత్తమ ఎడిటర్‌ – శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గిర గిర గిర ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌ – తోట తరణి (ఛాంపియన్‌) ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ – గోవింద్‌ (అఖండ) ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చంద్రకాంత్‌ (ఛాంపియన్‌) స్పెషల్‌ జ్యూరీ అవార్డులు: స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23 ఉత్తమ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు) స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్‌ (ఛాంపియన్‌) తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ అవార్డులు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Share this article

Related Articles