
మునిసిపల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
Advertisement
వికారాబాద్ : మహిళల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని చైర్‌పర్సన్ గడ్డం అనన్య తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళల అభివృద్ధి మరియు ఐక్యత కోసం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పలు గేమ్స్ నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం చైర్‌పర్సన్ కేక్ కట్ చేసి మహిళలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు
Share this article


