download
‘సారా’ అంశంపై చర్చకు సిద్ధం: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
General

‘సారా’ అంశంపై చర్చకు సిద్ధం: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Monday, 9 March 202612 views

Advertisement

అనంతగిరి డెస్క్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాన్ని ప్రస్తావించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సారా (దేశీ మద్యం) దుకాణాలను మళ్లీ ప్రారంభించే విషయాన్ని ఈసారి అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో జీరో అవర్ సందర్భంగా ఈ అంశంపై మాట్లాడతానని ఆయన వెల్లడించారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, గతంలో సారా తాగిన వారు 100 సంవత్సరాలకు పైగా జీవించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లిక్కర్ సేవించడం వల్ల ప్రజలు 80 సంవత్సరాలకే చనిపోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సైన్టిఫిక్‌గా పరిశీలిస్తే సారా ఆరోగ్యానికి హానికరం కాదని తన అభిప్రాయమని తెలిపారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు సారా దుకాణాలను అధికారికంగా నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సారా విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం సారా దుకాణాలను ఎందుకు మూసివేసారో స్పష్టత రావాలని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో ప్రస్తావించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఆదాయం, ప్రభుత్వ ఆదాయ వనరుల అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగుతుందో ఆసక్తి నెలకొంది.

Share this article

Related Articles