download
కేరెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణోత్సవం
General

కేరెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణోత్సవం

Friday, 27 March 202646 views

Advertisement

ధారూరు : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధారూరు మండలం కేరెళ్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఎంతో వైభవంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో గ్రామ ప్రజలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భజన మండలి సభ్యులు భక్తి గీతాలు ఆలపిస్తూ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముడి ఆశీస్సులు కోరుకున్నారు. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, బీజేపీ నాయకులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సదానంద్ రెడ్డి, ధారూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పద్మమ్మ రాములు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొని ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు

Share this article

Related Articles