download
రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర
General

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

Friday, 20 March 20265 views

Advertisement

వికారాబాద్: పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దానగుణం, సహనానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లింలు, వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో, ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. నెల రోజుల పాటు నిష్ఠతో ఉపవాసాలు పూర్తి చేసి జరుపుకునే ఈద్ పండుగ ప్రజల జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని కోరారు.ఈ పండుగ సమాజంలో మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ స్నేహ మెహ్ర కోరారు.

Share this article

Related Articles