download
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ రఘుకుమార్
General

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ రఘుకుమార్

Saturday, 7 March 20267 views

Advertisement

వికారాబాద్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వికారాబాద్ సీఐ రఘుకుమార్ సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించేందుకు వికారాబాద్ పట్టణ యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్‌లో విజేతలైన జట్లకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతను ప్రోత్సహించారు. కార్యక్రమంలో స్థానిక యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Share this article

Related Articles