download
భార్యను వేధించిన భర్త, అత్తకు జైలు శిక్ష
General

భార్యను వేధించిన భర్త, అత్తకు జైలు శిక్ష

Monday, 23 February 20260 views

Advertisement

వికారాబాద్ , ఫిబ్రవరి 23: అదనపు వరకట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా వేధించిన కేసులో భర్తతో పాటు అత్తకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ పరిగి జుడీష్యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎన్. శిల్పా తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి బి. సరోజ వెల్లడించారు. వివరాల ప్రకారం, మేడిపల్లి కలాన్ గ్రామం, పూడూర్ మండలానికి చెందిన అర్ఫాన్ ఖటూన్ 19-01-2016న మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త మొయిన్ పాషా, అత్త రహీమ బేగం కలిసి అదనపు వరకట్నం కోసం వేధిస్తూ, కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించారని పేర్కొంది. అప్పటి ఎస్‌ఐ శ్రీమతి ఎం. రేణుకా రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం నిందితులపై చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేయగా, కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఇద్దరినీ దోషులుగా తేల్చి శిక్ష విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శ్రీమతి సమీన బేగం వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎస్‌ఐ ఎం. రేణుకా రెడ్డి, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ జి. నరేందర్ రెడ్డిని సీఐ బి. సరోజ అభినందించారు.

Share this article

Related Articles